మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలి – మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ ఎంసిహెచ్ ఆసుపత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా. శివదయాల్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు పట్టుదలతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్లి విజయం సాధించాలని, సమాజంలోని ప్రతి మహిళ సాధికారత సాధించాలని, అందుకు ప్రభుత్వ నుండి సహాయ సహకారాలు లభిస్తాయని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని అందించడం ఒక గొప్ప ముందడుగని ఎమ్యెల్యే పేర్కొన్నారు.

అనంతరం ఆసుపత్రి సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బొజ్జ పవన్, ఇతర నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కిరణ్ కుటుంబానికి పరామర్శ : అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా

అదేవిధంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పిట్లం బేస్ కు చెందిన కిరణ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం కిరణ్ కుటుంబాన్ని పరామర్శించి, అన్నివిధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment