|| దృశ్యం న్యూస్ ||
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రతి నెల రెండో శనివారం ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నారు.
ఈ మేళాలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ సుభంగీ (మహిళల ప్రత్యేక వైద్యురాలు), డాక్టర్ నరేష్ కుమార్ (చర్మ వ్యాధి నిపుణుడు) లచే వైద్య సేవలు అందించబడ్డాయి.
ఈ ఆరోగ్య మేళాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 154 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 61 మంది మహిళా రోగులు, 37 మంది చర్మవ్యాధి బాధితులు, 56 మంది సాధారణ రోగులు చికిత్స పొందారు. అవసరమైన రోగులకు రక్త పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందించడంతో పాటు తగిన సలహాలు అందించారు. తీవ్ర సమస్యలు ఉన్నవారు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ సుభంగీ, డాక్టర్ నరేష్ కుమార్ లతో పాటు ఆసుపత్రి సిబ్బంది కృష్ణ, మురళి, సంతోష్, వాజీద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.








