|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా,ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుభంగీ, డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గల్లి నుండి ఢిల్లీ వరకు ప్రతిచోటా మహిళలదే ప్రాముఖ్యత చాటుతున్నారని పేర్కొన్నారు.
మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేడుకలు అవసరమని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భూలక్ష్మి, స్టాఫ్ నర్సులు లత, సుమలత, కల, ఆశా కార్యకర్తలు కళ్యాణి, నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు.








