|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పిస్తూ, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వివాదాలు జీవితాంతం కొనసాగకుండా, శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ అద్భుతమైన అవకాశమని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ లోక్ అదాలత్ వివరాలను క్షుణ్ణంగా తెలిపారు.
– తేదీ:మార్చి 8
– స్థలం: మెదక్ కోర్టు
– ఉచిత న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అని,
రాజీపడదగిన కేసుల వివరాలు :
1. యాక్సిడెంట్ కేసులు
2. మోసం (చీటింగ్) కేసులు
3. దాడి కేసులు
4. వివాహ సంబంధిత కేసులు
5. కరోనా సమయంలో నమోదైన కేసులు
6. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
7. ఇతర రాజీపడదగిన కేసులు
కోర్టుకు హాజరు అయ్యే విధానం :
– ఫిర్యాదు దారుడు & నిందితుడు ఇద్దరూ హాజరుకావాలి
– ఆధార్ కార్డు & అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకురావాలి
– కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు
జాతీయ లోక్ అదాలత్ ప్రయోజనాలు :
✅ త్వరిత న్యాయం – కోర్టు తిప్పలు లేకుండా తక్షణ పరిష్కారం.
✅ తక్కువ ఖర్చుతో పరిష్కారం – లీగల్ ఖర్చులు తగ్గింపు
✅ శాంతియుతంగా వివాద పరిష్కారం.
✅ కోర్టు సందర్శన అవసరం లేకుండా ఒకే రోజు లో పరిష్కారం.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరు శాంతిని పొందాలని మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మరిన్ని వివరాల కోసం మీ ప్రాంతీయ పోలీస్ స్టేషన్ లేదా కోర్టు అధికారులను సంప్రదించండి అని కక్షిదారులకు తెలిపారు.








