మెదక్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సీఈఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ ఎల్లయ్య, కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ, మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు.
మహిళా శక్తిని మరింత వెలుగులోకి తెచ్చేందుకు, సమగ్రాభివృద్ధికి సహాయపడేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ వేడుకలో జడ్పీ సీఈఓ కార్యాలయ ఉద్యోగులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళా సాధికారత, సమానత్వం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment