మెదక్ : పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు

ఈ కార్యక్రమంలో బిజెపి దుబ్బాక కో-కన్వీనర్ గోవింద్, ఓబీసీ మోర్చా గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు భాస్కర్ అదేవిధంగా నరేష్, లక్ష్మణ్, రమేష్, గురుపాదం, లింగారెడ్డి, నర్సింలు, సత్యం, సందీప్, నితిన్ తదితర బీజేపీ నాయకులు హాజరయ్యారు.

ఈ వార్షికోత్సవనికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి మహిమను తెలియజేస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment