బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ నేతల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ, జాక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామానికి నవోదయ పాఠశాల మంజూరు అయి పనులు ప్రారంభించే దశకు చేరిన, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నవోదయ పాఠశాల ఏర్పాటుకు 30 ఎకరాల స్థలం అవసరం. కానీ బోధన్‌లో చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో కేవలం 8 ఎకరాల స్థలం మాత్రమే ఉండటంతో, 30 ఎకరాలు ఉన్న కలిగోట్ గ్రామానికే మంజూరు చేయడం జరిగిందని బిజెపి నేతలు తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో కర్క గంగారెడ్డి, కర్క పెద్ద బాల్రెడ్డి, చిలుక మహేష్, గంగదాసు రాజు, శేఖర్, రాజేందర్, చిలక నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment