పట్టభద్రుల ఓటర్లకు హృదయపూర్వక నమస్కారాలు – ఎమ్మెల్సీ అంజిరెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ ఓటర్ల మహాశయులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియచేసారు, బీజేపీ అభ్యర్థిగా పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన నేను ఈ విజయాన్ని పట్టభద్రుల ఓటర్ల మద్దతుకు అంకితం చేస్తున్నాను అని, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ పట్ల యువతలో, కుటుంబాల్లో మంచి ఆలోచన విధానం ఉందని తెలిపారు.

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, బీజేపీ బలోపేతం కావాలని, ప్రజలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విజయం ఇతర జిల్లాలకు కూడా ప్రేరణగా మారి, బీజేపీ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసాన్ని కలిగింస్తుందని తెలిపారు. మన తీర్పు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని ఆశిస్తూన్నాను” అని అంజిరెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment