|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో ప్రగతి నగర్ పాటిదార్ భావన్ లో నిర్వహించిన ఉపాధ్యాయ వందన కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యలపై శాసనసభలో ప్రశ్నించే గొంతుకగా కొమురయ్యను గెలిపించిన ఘనత ప్రతి ఉపాధ్యాయునికి దక్కుతుందని పేర్కొన్నారు.

ఈ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక “చెంప పెట్టు” లాంటిది అని వ్యాఖ్యానించారు. గ్యారంటీలు మరియు హామీలు ఇచ్చి, మాయ మాటలతో పూట గడుపుతున్న రేవంత్ సర్కార్ కు ఈ ఫలితం ఒక గుణపాఠంగా మారిందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటానికి దారి సుగమం అయిందని తెలిపారు. TPUS నాయకులు, బిజెపి కాషాయ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, మేధావులు కృషి చేసి ఈ విజయాన్ని సాధించారు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, TPUS జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి, కొండా ఆశన్న, రెంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.








