కార్యకర్తలే పార్టీకి ఆయువు: మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ ||

కార్యకర్తల శ్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు కారణమైంది అని వారు లేకపోతే పార్టీయే లేదని, గాంధీ భవన్‌లో మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మీనాక్షి నటరాజన్ పాల్గొని కాంగ్రెస్ నాయకులకు సూచనలు ఇచ్చారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ మంత్రులు దామోదర్ రాజ నరసింహ, కొండ సురేఖ, నీలం మధు ముదిరాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
మీనాక్షి నటరాజన్, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతం కోసం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, కార్యకర్తలతో కలిసి అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీలో దృష్టిని పెంచుకుంటాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇంచార్జిలు, డీసీసీ ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment