|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వనదుర్గామాత ఆశీస్సులతో మెదక్ జిల్లా ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

వనదుర్గామాత ఆలయానికి వెళ్లిన పద్మదేవేందర్ రెడ్డికి ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు.
జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా అమ్మవారి సమక్షంలో గాజులు కొనుగోలు చేయడం కూడా జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ బాలగౌడ్ విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








