మానవత్వాన్ని చాటుకున్న వర్ని పోలీస్ అధికారులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఉన్న సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నందు వర్ని పోలీస్ స్టేషన్ సమీపంలో త్రీ విల్లర్ ప్యాసింజర్ ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని వర్ని పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారు వెంటనే క్షేత్రగాత్రుడిని ఆటో లోపల నుంచి బయటకి తీసి, 108 కు సమాచారం ఇచ్చి గాయపడ్డ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్ తప్ప ప్యాసింజర్లు ఎవరూ లేని కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో వర్ని పోలీస్ అధికారులు ప్రదర్శించిన వేగవంతమైన స్పందన మరియు సహాయాన్ని గ్రామస్తులు మెచ్చుకున్నారు. మానవత్వాన్ని ప్రదర్శించిన పోలీస్ అధికారుల ఈ చర్య సామాజిక బాధ్యతను చాటుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment