ఏడుపాయల జాతర ఉత్సవాలకు అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు : మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థాన మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించిన తర్వాత ఈ నిధులను రాష్ట్రమే అందించింది అని, 26వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో దాదాపు 15 నుండి 20 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది అని తెలిపారు.

జాతర ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు కోరారు. జాతరలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం మరియు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మెదక్ ఎమ్మెల్యే అధికారులతో చర్చించి తగిన ఏర్పాటు చర్యలు చేపట్టారు.

భక్తులు స్నానాలు చేసే గట్టాల వద్ద గజ ఈతగాలను ఏర్పాటు చేసి, సురక్షితంగా అందరికీ సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ ఉత్సవాలు కర్నాటక, మహారాష్ట్రల నుండి వచ్చే భక్తులకు కూడా సౌకర్యంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment