|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్‌లోని మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం అందించింది. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఈ నిధులను చర్చ్ కమిటీకి అందజేశారు.

ఈ సందర్భంగా మాధిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, “సమాజ సేవే మా లక్ష్యం” అన్న సంకల్పంతో MDR ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి అనేక మార్గాల్లో సేవ చేస్తున్నామని తెలిపారు. మతసామరస్యాన్ని గౌరవిస్తూ సమాజానికి సేవ చేయడం మన బాధ్యత అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ రంజిత్, సెక్రటరీ సోలమన్, భాస్కర్, విల్సన్, జేమ్స్, విక్రాంత్, జీవన్, జాన్సన్ మరియు చర్చ్ కమిటీ సభ్యులు పాల్గొని, మాధిరి పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. MDR ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని వారు కోరారు.








