తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ ||

ఫిబ్రవరి 27న నిర్వహించనున్న తెలంగాణ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు.

శుక్రవారం మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలని మరియు పోలింగ్ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుందని వెల్లడించారు.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమాలు కఠినంగా అమలు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు నియమాలు వివరిస్తూ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో 1347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

అదేవిధంగా, ఈ నెల 11వ తేదీన పీవోస్-ఏపీవోస్ ట్రైనింగ్, 21-02-2025 తేదీన రెండో విడత ట్రైనింగ్ పూర్తి కాగా, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ 24వ తేదీన నిర్వహించబడుతుంది.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment