|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్‌లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్ ద్వారా సరఫరా చేస్తున్న మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, మండలాల్లో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలకు మందులు సకాలంలో సరఫరా జరుగుతాయని తెలిపారు.

తనిఖీ సమయంలో, కలెక్టర్ మెదక్ ఏరియా ఆసుపత్రిలో వ్యాధి నిరోధక టీకాలు నిల్వ చేసే గదిని కూడా పరిశీలించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి కంటి పరీక్ష చేసే విధానాన్ని రోగులతో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఫిజియోథెరపీ సెంటర్ సేవలను, డిప్యూటీ కార్యాలయాన్ని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే సూచనలను చేస్తూ. డెంటల్ విభాగాన్ని కూడా పరిశీలించి సమర్థ నిర్వహణ కోసం మార్గదర్శకాలు అందించారు.

కలెక్టర్, జిల్లా వైద్య సేవలను ప్రణాళికబద్ధంగా విస్తరించాలని, అన్ని PHCలలో 100% ఇమ్యునైజేషన్ కార్యక్రమం అందించాలని, ప్రభుత్వ డెలివరీలను పెంచడం ద్వారా సాధారణ ప్రసవాలను పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ శివదయాల్, డాక్టర్ శివరాం, యునైజేషన్ అధికారి మాధురి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్, తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.








