|| దృశ్యం న్యూస్ ||
నేడు మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్య ఓటు (1) వేసి మంచి ప్రాధాన్యతతో గెలిపించాలని, అలాగే గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని కూడా గెలిపించాలని కోరారు.
బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ల ఓటర్లతో మాట్లాడిన అనంతరం బిజెపి అభ్యర్థులే గెలుపు సాధిస్తారని అన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభారి డాక్టర్ మురళి గౌడ్ విచ్చేసి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. టీచర్లు మరియు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి బిజెపి అభ్యర్థులే నిబద్ధత చూపిస్తారని, అదేవిధంగా నరేంద్ర మోడీ దేశ భద్రత కోసం సమాన పౌర హక్కుల కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా బిజెపి అభ్యర్థులు గెలిస్తే, ఉద్యోగ అవకాశాలు, ఉపాధ్యాయుల సంక్షేమం, న్యాయవాదుల సంక్షేమం, వైద్య రంగ అభివృద్ధి వంటి అంశాలపై పెద్దపీట వేసే అవకాశాలు ఉంటాయని చెప్పారు. టీచర్లు సమాజ భవిష్యత్తును మార్చే దిక్సూచి అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ బిజెపి అభ్యర్థులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి MLN రెడ్డి, ఓబీసీ అధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ మధు, రాష్ట్ర ఇంచార్జ్ వీణరెడ్డి, కవితారెడ్డి, కొండలరావు, రాజేందర్, లోకేష్, శివ, సంగీత, రాములు మరియు ఇతర మండలాధ్యక్షులు పాల్గొన్నారు.








