మెదక్ : స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణం – భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమైన భూమి గురించి పరిశీలన చేశారు.

పాపన్నపేట మండలంలోని తమ్మాయిపల్లి గ్రామం, పాపన్నపేట గ్రామాలలో భూమిని పరిశీలించి 10 నుండి 15 ఎకరాల భూమి కోసం సమీక్షలు నిర్వహించారు. ఈ భూమి ఎంపిక ప్రక్రియలో ఆర్డీవో రమాదేవి, ఇంచార్జ్ తాసిల్దార్ మహేందర్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణం కోసం అవసరమయ్యే ప్రక్రియలు వేగవంతం చేయాలి అని, ఈ భూమి గుర్తింపు ప్రక్రియలో భూ పరిపాలన విభాగం హైదరాబాద్ వారికి ప్రతి పాదనలు పంపి సమీక్షలు నిర్వహించాలి అని, ఈ ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందించబడతాయని తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ఇంచార్జి డిప్యూటీ తాసిల్దార్ మహేందర్ గౌడ్, సంబంధిత రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment