|| దృశ్యం న్యూస్ ||
మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రోజు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు, సామాజిక, ఆర్టిక, విద్య, ఉపాది, రాజకీయ, కుల సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు తెలియచేస్తూ, టోల్ ఫ్రీ నంబర్ 040-21111111 ద్వారా లేదా ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసుల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసి సమర్పించడం ద్వారా వారు సర్వేలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

అదేవిధంగా “ఈ సేవా కేంద్రాలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘు, పంచాయతీ సెక్రటరీలు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








