ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలని ఏసీబీకి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ కూతురుకు 2019-2020 MBBS/BDS అడ్మిషన్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ ద్వారా నిజామాబాద్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని, ఇది అక్రమంగా పొందినట్లు యూత్ కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్ రెడ్డి ఆరోపిస్తూ అప్పటి స్థానిక ఎంఆర్ఓ నుంచి ఎటువంటి పరిశీలన లేకుండా EWS సర్టిఫికెట్ జారీ చెయ్యడం పై ఏసీబీకి శుక్రవారం పిర్యాదు చేయడం జరిగింది అని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలుపుతూ, ప్రభుత్వ అధికారులు ఇకనైనా వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ సర్టిఫికెట్ 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని, ఈ సర్టిఫికెట్ పొందిన అమ్మాయి తండ్రి తనకు సుమారు 15 ఎకరాల ఆస్తులు ఉన్న వ్యక్తిగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడాని, ఈ వ్యవహారం నేపథ్యంలో స్థానిక ఉన్నత అధికారులు కాలయాపన చేస్తున్నారని ఇకనైనా ఈ విషయంపై చర్చించి వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిపై తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని మధుసూదన్ అభ్యర్థన చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment