యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. మండలంలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో రైతులకు యసంగి కాలం పంటకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.

బాలరాజు మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూరియా కొరత అనేది అవాస్తవం అని, పంటకు కావలసిన యూరియా అందుబాటులో ఉంది అని
పుకార్ల కారణంగా రైతులు ఎక్కువ యూరియా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం జరుగుతోంది అని చెప్పారు.

రైతులకు ఆయన సూచన చేస్తూ తమకు అవసరమైన యూరియా మాత్రమే వాడుకోవాలని అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతర రైతులకు కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment