|| దృశ్యం న్యూస్ ||
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మితిమిరిపోతుంది. శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర జ్వరంతో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు అతని సరిగ్గా పరిశీలన చేయకుండా రెండు మాత్రలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా సూపరిడెంట్ ప్రతిమరాజ్ కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై తగు చర్యలు చేపట్టి రోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా చెయ్యాలని కోరారు. గతంలో కూడా వైద్యుల వైఖరి మార్చుకోవలంటూ ఎన్నిసార్లు సూచించినప్పటికీ పట్టించుకోనే అధికారులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తమ తీరును మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కి బోధన్ ఆసుపత్రి వైద్యులపై ఫిర్యాదు చేసే చర్యలు చేపడతామని హెచ్చరించారు.








