|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి. పేద బ్రాహ్మణులు శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తొట్లెలో నిలిపి పూల దండలతో అందంగా అలంకరించారు. ఈ వేడుకలు కనువిందు చేస్తున్నాయి. మహిళలు ఊయల ఊపుతూ జోలపాటలు పాడి భక్తులను మంత్రోత్సాహంతో ఆధ్యాత్మికంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న పురోహితులు శ్రీమాన్ అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, దత్తాత్రేయ స్వామి సేవలో పాల్గొనడం మనందరి అదృష్టం అని, మేడి చెట్టు కింద ప్రతిష్టించిన శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో సంతానం లేని దంపతులు పాల్గొని పూజలు చేసిన వారికి సంతానం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్న దంపతులకు ఎంతోమందికి సంతానం లభించింది అని వారు చెప్పారు.

ఈ వేడుకలు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవంతో అనుసంధానించబడ్డాయి. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులతో ఆలయంలో సందడి నెలకొంది, గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేయబడింది.








