|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని మల్లన్న ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ గొల్ల, యాదవులు బోనాలు తీసుకుని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుల తీర్చుకున్నారు.
ఈ జాతరలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు,ఈ జాతరలో భక్తుల ఆధ్యాత్మిక అనుభవం మరింత ప్రగల్భంగా మారింది.

మల్లన్న జాతర మహోత్సవం కోసం మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఈ జాతరను ఘనంగా నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కుల పెద్దలు రాజేశ్వర్, మహిపాల్, బాలయ్య, స్వామి, పాలెం రాజేశ్వర్, జీర్రా రాజు, జీర్రా మైపాల్, రాజు, రంజిత్, గంగాధర్, దుర్గయ్య, సాయిలు, శేఖర్, కురుమ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








