అగ్ని ప్రమాదంలో నివాసం కోల్పోయిన మాలగుట్ట వృద్దురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట గోసంగి కాలనీలో సంపంగి సాయమ్మ అనే వృద్దురాలి నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో ఆమె కుటుంబం రోడ్డున పడింది.
ఈ విషాద ఘటన తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తక్షణ సహాయంగా బియ్యము, వంట నూనె, నిత్యావసర వస్తువులు, నగదు అందజేశారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో బాధిత కుటుంబానికి ఆదుకొనటానికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చెలిమెల మల్లికార్జున్, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు చెలిమెల శ్రీనివాస్, జీయర్ గంగారెడ్డి, పోతరాజు, గురిజల లింబాద్రీ, బొక్కల బాలయ్య, హమీద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దినకర్, రూరల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎబినేజర్, రమణ, సాయి, హేమంత్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment