|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్, ఎడపల్లి మండలాల నుండి చలో హైదరాబాద్ మహాధర్నకు పెద్ద ఎత్తున కదిలి వెళ్లడం జరిగింది. ఈ ధర్నా ఇందిరాపార్క్ వద్ద నిర్వహించబడుతుంది తెలియచేస్తూ, ఈ ధర్నాలో పాల్గొనడానికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.శాల గంగాధర్, జిల్లా అధ్యక్షులు గైని రాములు, ఉపాధ్యక్షులు షేక్ నజీర్, కోశాధికారి రామ్ పటేల్, ఉపాధ్యక్షురాలు సాయమ్మ కొప్పుల లలిత అర్చన, సంగీత, రాకేష్ వర్మ, గోవుర్ సాయి, రాజు హరీష్ ధర్మయ్య, శ్రీనివాస్ ఎల్లయ్య, సందుల రాజు, హనుమంతరావు తదితరులు బయలుదేరారు.
ఈ సందర్భంగా ఏశాల గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి వికలాంగుడికి నెలకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కొత్తగా దరఖాస్తు చేసిన 28 లక్షల మందికి కొత్త పెన్షన్లు, అంతోదయ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీ, రుణాలు, స్కూటీలు, సైకిల్ బండీలతో సహా మరికొన్ని ముఖ్యమైన డిమాండ్లను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు.








