మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద జరిగిన బహిరంగ సభలో దినేష్ కులచారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయారని ఆరోపించారు.

రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి వంటి హామీలన్నీ అమలు కాకుండా అబద్ధాలుగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల అవకతవకలు చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన పేరుతో మరో లక్షన్నర కోట్ల రూపాయల మోసానికి తెర లేపారని చెప్పారు.

అతనితో పాటు ఈ సభలో డిచ్ పల్లి మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, ధర్పల్లి భాజపా మండలాధ్యక్షులు లోలం గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, జిర్ర మహిపాల్ యాదవ్, నరేష్, టి. శ్రీనివాస్, పల్లె రాజన్న, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment