పుల్కాల్ : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ ||

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పుల్కల్ మండల కేద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, “అమర్ హై అంబేద్కర్”, “జోహార్ అంబేద్కర్” వంటి నినాదాలు చేస్తూ అంబేద్కర్ గౌరవార్థం పాటలు పాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అంబేద్కర్ ఆలోచనలకు, ఆయన దేశానికి చేసిన సేవలకు గౌరవంగా ఈ ఉత్సవాన్ని జరిపారు. అంబేద్కర్ యొక్క త్యాగాలు, సమానత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుల్కల్ మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment