|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోనాజిపేట్ గ్రామంలో, సొసైటీ చైర్మన్ వెంకం గారి జనార్ధన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీకి పది సంవత్సరాలు పట్టిందని కాని కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లోనే రెండు లక్షల రూపాయల రైతు రుణాన్ని మాఫీ చేసి ప్రజా ప్రభుత్వంగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వెంకం గారి జనార్ధన్ రెడ్డి మరియు భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, గత యాసంగి ధాన్యం కొనుగోలు, ప్రస్తుత వానాకాలం ధాన్యం కొనుగోలు వంటి అంశాలను అమలు చేస్తూ, పది నెలల్లో ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషిని కొనియాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది అని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలైన 6 గ్యారంటీలను అమలు చేస్తూ, రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మామిడి రాములు, భగవత్ పంగి, నీరడి గంగా నరేందర్, బేల్తాడిది ధర్మేష్, మైలారం సుభాష్ రెడ్డి, భూమయ్య గారి సాయిలు, వేల్పూర్ చిన్న గంగారెడ్డి, నిమ్మల మోహన్, ఏఎంసీ డైరెక్టర్ మెగావత్ మంగిత్య, మాజీ వైస్ చైర్మన్ వి నారాయణరెడ్డి, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.








