|| దృశ్యం న్యూస్ ||
భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వర్ని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్‌లో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (Addl. JFCM) బోధన్ సాయిశివ హాజరయ్యారు. ప్రిన్సిపల్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ సాయిశివ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు.

భారత రాజ్యాంగం సమానత్వానికి పునాదిగా భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి హక్కు కల్పించడంతో పాటు, పౌరుల మధ్య సోదరభావాన్ని పెంచుతుందని, రాజ్యాంగం ప్రతి పౌరుని సమాన అవకాశాలు కల్పించడమే కాక, ప్రజల మధ్య వివక్షతను నిర్మూలిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్, రుద్రూర్ సిఐ కృష్ణ, వర్ని ఎస్సై రమేష్, బోధన్ ఏపిపి సమ్మయ్య మరియు న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు








