తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది.
ఈ శిబిరంలో సన్ రైస్ హాస్పిటల్ నిజామాబాద్ నుండి ఒక వైద్య బృందం పాల్గొని శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
TGVP బోధన్ డివిజన్ అధ్యక్షుడు మిసాలే నాగేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఈ కార్యక్రమం ఎంతో కీలకంగా మారింది అని తెలిపారు.

ఈ వైద్య శిబిరంలో విరేష్, సునీల్, రాహుల్ వంటి యువ నాయకులు కూడా పాల్గొని సహకరించారు.
గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన తెలియచేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించడంతో పాటు, సామాజిక బాధ్యతను ప్రదర్శించటం జరిగింది అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment