|| దృశ్యం న్యూస్ ||
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీను నాయక్ వైద్య బృందం ఉచిత దంత వైద్య శిబిరం దర్పల్లి మండలం మైలారం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలోని పిల్లలకు ఉచిత దంత చికిత్సలు అందించడం, దంతాల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం జరిగింది.

వైద్య శిబిరంలో పిల్లలకు దంతాల్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో, వాటిని రక్షించుకునే విధానాలు గురించి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి మైలారం స్పెషల్ ఆఫీసర్, ఎస్జిటియూ ధర్పల్లి మండల అధ్యక్షులు న్యావనందిగంగాధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఈ ఉచిత దంత వైద్య శిబిరం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన దంత సంరక్షణకై ముఖ్యమైన చిట్కాలు అందించడంతో వారు ఆరోగ్యకరమైన అలవాట్లను అవలభిస్తారని ఆశిస్తున్నారు.








