నూతన జాతీయ విద్య విధానానికి వ్యతిరేకంగా AIPSU ఆధ్వర్యంలో ఛలో పార్లమెంట్.

|| దృశ్యం న్యూస్ ||

అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో “ఛలో పార్లమెంట్” పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

AIPSU నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ,
ఈ నెల 28న నిర్వహించబోయే ఛలో పార్లమెంట్ కార్యక్రమం విద్య, ఉపాధి, మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించే కీలక ఉద్యమంగా మారబోతుందని, ప్రభుత్వాలు విద్య రంగాన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని బడ్జెట్‌లో విద్యకు కేటాయించే నిధులు ప్రతీ సంవత్సరం 2-3 శాతం మాత్రమే పెంచుతున్నాయని విమర్శించారు. “కొఠారి కమిషన్” ప్రకారం, విద్య రంగానికి మొత్తం బడ్జెట్‌లో 10 శాతం కేటాయించాలని సూచించారు.

నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతిలో అప్పగించాలని చూస్తుందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో AIPSU నాయకులు శివాజీ, కృష్ణ, నాగేష్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment