|| దృశ్యం న్యూస్ ||
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శోకకర సంఘటన చోటుచేసుకుంది, పియుసి-2 చదువుతున్న స్వాతి ప్రియ (17) అనే విద్యార్థిని, సోమవారం ఉదయం హస్టల్ గదిలోని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తోటి విద్యార్థినులు బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుందాని సమాచారం,
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన విద్యార్థినిగా అధికారులు గుర్తించారు, తన వ్యక్తిగత కారణాలు కారణమయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాసర పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటన విద్యార్థుల మధ్య ఆత్మహత్యలకు సంబంధించి ఎక్కువ చర్చలను ప్రేరేపిస్తోంది, ప్రభుత్వం, విద్యా సంస్థలు ఈ తరహా ఘటనలను నివారించేందుకు మరింత చర్యలు తీసుకోవాలని స్థానికూలు కోరుకుంటున్నారు.








