ప్లాస్టిక్ నిర్ములన ప్రకటనలకు మాత్రమే : నివారణ పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.

|| దృశ్యం న్యూస్ ||

ప్లాస్టిక్ వినియోగం మరియు దాని కారణంగా పర్యావరణంపై కలిగే ప్రభావాలు గురించి నిపుణులు మరియు ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం ఇంకా విస్తృతంగా కొనసాగుతునే ఉంది.
ప్లాస్టిక్ వాడకం, వ్యాపారాలు, తయారీ కేంద్రాలు యథాతథంగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు ఈ విషయమై కఠిన చర్యలు తీసుకోవడం లేదు.
ఉన్నత అధికారుల నుండి ఉత్తర్వులు వచ్చినప్పుడే సంబంధిత అధికారులు కొన్ని రోజులు హడావిడి చేసి చిన్న చిన్న విధి వ్యాపారులపై వారి జులుం ప్రదర్శించడం తప్ప ప్లాస్టిక్ సంబంధిత వ్యాపారాల కేంద్రాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనించవలసిన విషయం.

అధికామవుతున్న ప్లాస్టిక్ వినియోగం :

ప్రస్తుతం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యాపారం ముమ్మరం తయారైంది, ఈ పట్టణాల మార్కెట్లలో ప్లాస్టిక్ తయారీ, అమ్మకాలు, వాడకం జరుగుతూనే ఉన్నాయి. మున్సిపల్ మరియు పట్టణ అధికారులు చెత్త వాహనాలకు మైకులు అమర్చి ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేయడం తప్ప ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల కోసం వ్యాపారస్తులపై చర్యలు తీసుకోడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్లాస్టిక్ వాడకం నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం :

ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి గతంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు సంబంధిత అధికారులు ఉరుకులు పరుగులు పెడుతు కొన్ని రోజులు కఠినంగా వ్యవహరించిన ప్రస్తుతం వాటి అమలు చాలా సడలిపోయి యథాతథంగా కొనసాగుతోంది.
అన్ని వ్యాపారులకు ప్లాస్టిక్ బ్యాగులను అనధికారికంగా వాడుతునే ఉన్నారు, ప్లాస్టిక్ వ్యాపారాలు, తయారీ కేంద్రాలు కూడా సజావుగా కొనసాగుతునే ఉన్నాయి.

ఈ పరిస్థితిని ధృవీకరిస్తూ, నిపుణులు,ఈ సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు ‘‘ప్రతీ సంబంధిత శాఖాధికారీకి, ఏవైనా పర్యావరణానికి హానికరమైన అంశాలు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలను గుర్తించినప్పుడు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కఠినంగా వ్యవస్థాత్మక చర్యలను తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పర్యావరణ ప్రమాదం: అనుమతులు లేని ప్లాస్టిక్ వినియోగం :

వాణిజ్య పరంగానే కాకుండా అనుమతులు లేకుండా కొంతమంది వ్యాపారస్తులు రోజుకు వేలాది ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆహార పదార్థాలు, నీటి సంబంధిత, శీతల పానీయాలు మరియు నూతనంగా కల్లు విక్రయ దారులు కుడా ప్యాకింగ్ చేస్తున్నారు.
ఈ విధానం పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుంది.
పిల్లల ఆహార పదార్థాలు కూడా ప్లాస్టిక్ ప్యాకింగ్ లో మారినప్పటికీ వాటిపై ఎటువంటి నిబంధనలు అమలు కావడం లేదు, దీనితో అనేక వాణిజ్య కేంద్రాల్లో ప్లాస్టిక్ వాడకం మరింత పెరిగిపోతుంది.

మార్పు కోసం అవసరమైన చర్యలు :

ప్రతీ ప్రభుత్వ శాఖ, సంబంధిత అధికారులపై ఈ సమస్యకు సంబంధించిన బాధ్యత ఉంచాలి, పర్యావరణ, ఆహార భద్రత, ఎక్సైజ్, తదితర శాఖలు కలసి ఈ సమస్యను పరిష్కరించాలి, కేవలం దాడుల ద్వారా మాత్రమే కాదు, ఎటువంటి వ్యాపారాలు అయిన అనుమతి లేకుండా ప్లాస్టిక్ ని వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

ఈ సమయంలో పర్యావరణ నిపుణులు, ప్రజా ప్రతినిధులు, వాణిజ్య బాధితులు కలసి పర్యావరణ పరిరక్షణ కోసం చర్చలు జరపాలని, అదేవిధంగా ప్రజలలో అవగాహన పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే చర్యలు మరింతగా విస్తృతంగా అమలు పరచాలని పలువురు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ సమస్యపై ఇప్పటికే అనేక నియమ నిబంధనలు, ఉత్తర్వులు ఉన్నా వాటిని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఒక స్థాయి మంచి మార్పు సాధించడానికి ఇదే సరైన సమయం భావించి అధికారులు తప్పకుండా తగు ప్రణాళిక నిర్ణయించుకోవాలిసిన అవసరం ఉంది.

ఇకనైనా ఈ సమస్యకు ప్రభుత్వం, మరియు అధికారులు ఇంకా ఆజ్యం అందిస్తారా , లేదా అదుపులో పెడతారా వేచి చూడాలి.

దృశ్యం న్యూస్.

Join WhatsApp

Join Now

Leave a Comment