రేవంత్ రెడ్డి దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర చేయాలి : ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ ||

నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రపై ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ,
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పాదయాత్రను మొదలుపెట్టడం విడ్డురంగా ఉందని తెలిపారు.

ఎమ్యెల్యే ధన్ పల్ మాట్లాడుతూ, రేవంత్ సర్కార్ కు దమ్ముంటే హైదరాబాద్ లో కూల్చిన ఇళ్ల దగ్గర నుండి పాదయాత్ర ప్రారంభించాలి అని డిమాండ్ చేసారు,
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆరు గ్యారంటీలను, రైతులకు రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయల సహాయం వంటి హామీలను పూర్తిగా అమలు చేయడంలోనూ విఫలమయ్యారాని ఈ పాదయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని పొందారు అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో ఇళ్లను కూల్చి పేదల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని, ప్రజలు కష్టపడి తమ ఇళ్లను నిర్మించుకుంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చడం దుర్మార్గం అని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లకు అనుమతులు ఇచ్చి ప్రజలపై అనేక రకాల బిల్లులు విధించి ఇప్పుడు అవి అక్రమాలు అని ప్రకటించడం అజ్ఞానం అని అన్నారు.

మూసి పరివాహక ప్రక్షాళనకు బిజెపి నాయకులు వ్యతిరేకంగా ఉన్నారని, మీరు మూసి ప్రక్షాళన పేరుతో లక్ష కోట్లు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారాని, ప్రజల హక్కులను పక్కన పెడుతూ దుర్మార్గంగా ప్రక్షాళన చేపడుతూ ఇళ్లను కూల్చడం సమర్థించదగిన చర్య కాదని పేర్కొన్నారు.

మూసి ప్రాంతం ఇప్పుడు మురికి కూపంగా మారిందని అంటున్నారు కానీ ఈ ప్రాంతాన్ని 50 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చిన ఇళ్ల గురించి, ప్రభుత్వ చర్యలు, మూసి ప్రక్షాళన వంటి అంశాలపై సరైన అవగాహన కలిగిన విధానం అవసరం అని తెలియచేస్తూ ప్రభుత్వ విధానాలు కేవలం రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా కాకుండా, ప్రజల సంక్షేమం కోసం ఉండాలి అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment