ధర్పల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చైర్మన్ నర్సయ్య, తదితర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకుంటు సంతోషంతో జరుపుకున్నారు, కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు అదృష్టం కలగాలని, ఆయన నూరేళ్లపాటు ప్రజలకు సేవ చేయాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిమ్మల చిన్న గంగాధర్ గౌడ్, బొక్కల బాలయ్య, సంతోష్ రెడ్డి, హమీద్, సురేందర్ గౌడ్, చెలిమిల శ్రీను, రమేష్ నాయక్, సునీల్, ఎబినేజర్, దినకర్, బన్నీ, జాషువా, రాకేష్, గుండయ్య, పోతరాజు, ప్రతాప్ గౌడ్, పోతరెడ్డి, అనిల్, గంగయ్య మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment