రగ్బీ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన చేగుంట విద్యార్థులు.

|| దృశ్యం న్యూస్ ||

చేగుంట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు SGF రగ్బీ క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
అండర్ 17 బాయ్స్ కేటగిరీలో పి. నరేష్, అరుణ్, అండర్ 17 గర్ల్స్ కేటగిరీలో దివ్య, గాయత్రి, అండర్ 14 బాయ్స్ కేటగిరీలో నవనీత్, సాయి కుమార్, అండర్ 14 గర్ల్స్ కేటగిరీలో అశ్విత అనే విద్యార్థులు ఎంపికయ్యారని పిడి శారదా తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను చేగుంట ఎంఈఓ నీరజ, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రఘుపతి, ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ విజయంతో చేగుంట పాఠశాల ఎంతో ప్రఖ్యాతి పొందిందని, ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుతారని ఆశిస్తూ విద్యావేత్తలు, శిక్షకులు వారికి ప్రోత్సాహం అందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, రమాదేవి, రమ, చల్లా లక్ష్మణ్, భవాని, మనోహర్ రావు, సరస్వతి, సురేందర్, వెంకటేష్, రేఖ, శ్రీవాణి, ఉమా దేవి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment