|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, చెత్త సేకరణ, అక్రమ నిర్మాణాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణలతో కలిసి నగరంలోని వివిధ సమస్యలపై చర్చించారు.
నగరంలో వీధి వ్యాపారం చేసే కూరగాయల అమ్మకదారులకు రైతు బజారులో స్టాల్స్ కేటాయించాలని సూచిస్తూ ప్రధాన వీధిలలో దుకాణాలు పెట్టడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది అని అంబులెన్సు వంటి అత్యవసర సర్వీసులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వీధి వ్యాపారాల నిర్వాహకులను వెంటనే రైతు బజారులోకి తరలించాలని,
అదేవిధంగా నగరంలో ఫుట్ పాత్ పై అక్రమ నిర్మాణాలు ఎక్కువయ్యాయని ఈ ఆక్రమణలు తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ ఏసీపీ లకు ఆదేశించారు. అవి తొలగించటం ద్వారా ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని ఎమ్యెల్యే తెలిపారు.
నగరంలో చెత్త సేకరణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అని ఈ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తూ,
నగర అభివృద్ధి కోసం ప్రజలు, అధికారులు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ తెలిపారు.
ఈ సమావేశంలో ట్రాఫిక్ సీఐ వీరయ్య, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.








