|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆరోగ్యం బాగాలేక మృతి చెందడం జరిగింది,
ఈ దురదృష్టకర ఘటనలో ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడానికి తెలంగాణ ఆగ్రో ఇండ్రస్టీస్ ఛైర్మెన్ కాసుల బాల్ రాజ్, ఉమ్మడి వర్ని మండలాల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కులకర్ణి సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అంతక్రియలో పాల్గొన్నారు.
శ్యామ్ సుందర్ గ్రామానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారాని, ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో భగవంతుని దయ ఎల్లవేళలా ఉండాలని, శ్యామ్ సుందర్ మృతి గ్రామంలో ఒక తీరని లోటుగా భావన కలుగుతుందని, ఆయన కీర్తిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.










