కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగి బదిలీ వివాదం

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల వ్యవధిలోనే రెండవ సారి బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

18 జూలై 2024న, ఓ ఉద్యోగి కౌన్సిలింగ్‌లో ఆప్షన్ తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి కామారెడ్డి వైద్య కళాశాలకు ఆఫీస్ సూపరిండెంట్ గా 21 జులై 2024న, బాధ్యతలు తీసుకోవడం, మళ్ళీ తిరిగి 27 జూలై 2024న, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిద్దిపేట వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే కామారెడ్డి వైద్య కళాశాలలో ఈ బదిలీ వ్యవధిలో పనిచేసిన సదరు ఉద్యోగికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే సిద్దిపేట వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఉత్తర్వులు రావడం, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నుండి రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని అక్కడ బాధ్యతలు చేపట్టడంతో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది,

ఈ విధానం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో స్థానికంగా వుండే ఉద్యోగస్తులలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఉద్యోగిపై కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల వారిపై ఈ బదిలీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఉద్యోగస్తుల మధ్య నిశ్శబ్ద సంకేతాలు వెలువడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment