|| దృశ్యం న్యూస్ ||
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన 8వ తెలంగాణ రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ గంధం రాజేష్‌కు డా. బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు-2024 అందించారు. ఈ అవార్డు నల్లా రాధాకృష్ణ, సీనియర్ రచయిత మౌనశ్రీ మల్లిక్ చేతుల మీదుగా అందించబడింది.
అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, కవులకు, రచయితలకు మరియు స్వచంద సంస్థలకు ఈ అవార్డులను అందిస్తుందని,
గంధం రాజేష్ దళిత సామాజిక వర్గానికి అందించిన సేవలను గుర్తించిన సెలెక్షన్ కమిటీ ఆయనకు ఈ నేషనల్ అవార్డు అందించడం విశేషమని రాధాకృష్ణ తెలిపారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి వంటి దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 300 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. దళితుల సాధికారత, సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యతతో ఈ కాన్ఫరెన్స్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
గంధం రాజేష్ వంటి వ్యక్తుల కృషి, సామాజిక న్యాయానికి అంకితభావంతో జరిగే ఉద్యమాలను ప్రోత్సహించడం ద్వారా, మన సమాజం అందరినీ సమానంగా చూడగలిగే దిశగా అడుగులు వేస్తోంది అని తెలిపారు.








