|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కారం అందిస్తూ గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు, కార్యదర్శికి అనుగుణంగా పనిచేసే పంచాయతీ కార్మికులు, గ్రామంలో జరుగుతున్న సేవలను మరింతగా మెరుగుపరిచేందుకు ప్రజలు, మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో తగిన పనులు చేస్తూ సాయిలు వంటి మంచి అధికారిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని భావించేలా చేస్తున్నారు.
ఇటీవల అనేక విషయాలలో గ్రామ పంచాయతీ పరిధిలో పలు సమస్యలు ఎదురైన వాటి నివారణకు తక్షణమే చర్యలు తీసుకొని గ్రామంలోని పరిశుభ్రత పర్యావరణం పరంగా గ్రామస్తులకు సమస్యలు ఏర్పడకుండా అవగాహన కల్పిస్తూ, తగు జాగ్రత్తలు చేపడుతూ గ్రామస్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తన విధి విధానాలతో పాటు గ్రామ అభివృద్ధికి సమయం కేటాయించి ప్రజల ఆరోగ్యం, శుభ్రత పట్ల ఎలా జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను గ్రామస్తులకు వివరిస్తూ గ్రామపంచాయతీ అధికారి పదవి యొక్క నిజాయితీ మరియు సమర్థతకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు.
గ్రామ పంచాయతీ విషయాలలో సరైన ప్రణాళికను అమలు పరుస్తున్నాడని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










