తెలంగాణలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం : ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ ||

ఈరోజు భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ డి. ఓ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించబడింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థుల సంక్షోభ పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ మరియు స్కాలర్షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి టి. సంజయ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్ మరియు స్కాలర్షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయని, గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులు ఈ రియంబర్మెంట్స్ కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారాని, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యజమానులు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తోంది.” “ప్రభుత్వం ఎందుకు విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదు?” విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థులకు మరియు ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ, అద్దె భవనాల్లో నివసిస్తున్న విద్యార్థులు, దసరా సెలవుల తర్వాత హాస్టళ్లకు వెళ్లినప్పుడు, అద్దె చెల్లించకపోవడంతో అక్కడి యజమానులు గేట్లకు తాళాలు వేస్తున్నారాని ఈ పరిస్థితి మరింత కష్టతరమైనదిగా మారుతోంది అని తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర నాయకులు కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ మరియు స్కాలర్షిప్స్ విడుదల చేయాలి. అన్ని హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించాలని సూచించారు.” లేకపోతే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాలు, రాజు, మహేశ్వరి, అరుణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment