|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల అనుభవాలను మరోసారి ప్రశ్నార్థకం చేసి, పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు చేసిన గట్టి ప్రయత్నాలు చేసిన చివరికి ఫలితాలలో ఎదురైన నిరాశకు సంబంధించిన అనేక అంశాలు చెప్పారు.
అనేక మంది విద్యార్థులు గత మే నెలలో జరిగిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తమంగా పరీక్షలు రాశారని, అయితే, ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు మూడు నుండి నాలుగు పేపర్లలో ఫెయిల్ కావడం, వారి ప్రతిభపై అన్యాయంగా ముద్ర పడినట్లు కనిపిస్తోందాని, రివాల్యుయేషన్ ఫలితాలలో 70-80 శాతం ఉత్తీర్ణత సాధించడం ప్రొఫెసర్ల నిర్లక్ష్యం స్పష్టంగా సూచిస్తోంది అని,
విద్యార్థులపై రివాల్యుయేషన్, ఇంప్రూవ్మెంట్, బ్యాక్లాగ్ ఫీజుల రూపంలో ఆర్థిక భారం పెట్టడం, యువతపై అనవసరంగా భారం తేవడం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత మూడేళ్లుగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడం, విద్యార్థులను అవస్థల మార్గంలోకి నడిపిస్తున్నది. ఇక రివాల్యుయేషన్ ఫీజు ఒక్కో పేపరుకు 600 రూపాయలు వసూలు చేయడం దురదృష్టకరమని వారు అన్నారు.
ఏఐపీఎస్ యు నాయకులు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల అభ్యంతరాలను తెలుసుకొని ప్రొఫెసర్ల పనితీరు పట్ల చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జీవితం తేల్చే ఈ విషయంపై ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని, యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావు ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు రవితేజ, కీర్తన, అమూల్య, వెంకటేష్, కార్తీక్, కావేరి, మనీషా, అరుణ్, నరసింహ తదితరులు, విద్యార్థుల పట్ల ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం మరియు యూనివర్సిటీ అధికారులు వీటిని సీరియస్‌గా తీసుకొని, విద్యార్థుల జీవితాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రతిభను గుర్తించడం, వారికి సముచిత గుర్తింపు ఇవ్వడం, అలాగే విద్యా నాణ్యతను మెరుగుపరచడం చెయ్యాలని తెలిపారు.










