వేతనలు లేక వేదనకు గురై మృతి చెందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు.

|| దృశ్యం న్యూస్ ||

మరో కార్మికుడు కేశవ నిజాం షుగర్స్ లో వేతన కార్మికుడిగా పనిచేసి, నేడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు.

అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, మరియు ముసలి తల్లి ఉన్నారు. ఫ్యాక్టరీ మూతపడడంతో వారు పనులు దొరకక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, పండగను కూడా జరుపుకోకుండా చాలా కష్టపడ్డారు. ఈ పరిస్థితి మనోవేదనకు దారితీసింది.

ప్రభుత్వం ఇటీవల షుగర్ ఫ్యాక్టరీ తిరిగి నడిపిస్తామని కార్మికులకు మాట ఇచ్చింది కానీ ఆలోచనలకు మాత్రం కార్యాచరణ లేకపోవడం, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించకపోవడంతో అనేకమంది కార్మికులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వము త్వరగా చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితులు మరింత తీవ్రతరం కావచ్చు.

కేశవ మృతి, కార్మికుల కష్టాలను ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి దీనికి పూర్తి బాధ్యత వహించి కనీసం మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వడం, లేదా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తగు చర్యలు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని సిఐటియు నాయకులు తెలిపారు.

ప్రభుత్వం, కార్మికుల జీతభత్యాలను కేటాయిస్తే, పరిస్థితి కొంత మెరుగుపడతుందని ఆశిస్తున్నాం, కేశవ వంటి మరెవరూ మృత్యువాత కాకుండా, కార్మికులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment