|| దృశ్యం న్యూస్ ||
ఆదివారం రోజున బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మరియు ప్రజలకు ఏనుగు రవీందర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేసారు,
కొత్తగా నియమించబడిన డిసిసిబి డైరెక్టర్ దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కమలాకర్ రెడ్డి యొక్క బాధ్యతలు, ప్రజల సంక్షేమానికి విధానాలు రూపొందించడానికి ఆయన కృషి అవసరమని పేర్కొన్నారు. దసరా పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పథకాలను అందించడానికి కమలాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించాలి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.










