గుర్తు తెలియని మృతదేహం లభ్యం : నెల రోజుల క్రితం మరణించి ఉండవచ్చు అని అనుమానం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ శివారులో గల బ్రిడ్జి వద్ద కూలినస్థితిలో ఓ మృతదేహం లభించింది.

ఈ రోజు మధ్యాహ్నం బొల్లాపల్లి నాగరాజు ఎడపల్లి గ్రామ సెక్రటరీ పోలీస్ స్టేషన్ లో ఒక ముఖ్యమైన సమాచారం అందించారు.
గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి, ఊరి శివారు ప్రాంతంలో బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం కనిపించినట్లు తెలపడంతో వెంటనే సెక్రటరీ సంఘటన స్థలానికి చేరుకొని శ్రీనివాస్ చెప్పిన ప్రకారం పరిశీలించగా అక్కడ నిజంగానే ఒక మృతదేహం ఉందని గమనించి మండల పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, దాదాపు 30 రోజుల క్రితం చనిపోయినట్లు మృతదేహం పూర్తిగా కమిలిపోయిన స్థితిలో ఉండటం, గుర్తు పట్టడానికి ఆనవాలు లేకపోవడంతో క్లూస్ టీం ను పిలిపించి దర్యాప్తు ప్రారంబించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన గ్రామస్థుల మధ్య ఓ భయభ్రాంతికరమైన వాతావరణం నెలకొంది, మృతుడి గుర్తింపు కోసం చర్యలు చేపడుతున్నట్లు, చనిపోయినది ఎవరో తెలుసుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని పోలీసులు స్థానికులను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment