|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మకమైన సమాచారంపై పంబండ గ్రామానికి చెందిన తాటికొండ శేఖర్ గౌడ్ తన పౌల్ట్రీ ఫారం పక్కన ఉన్న ఇంటిలో పీడీఎస్ బియ్యం నిల్వచేసి ఉంచినట్లు గుర్తించారు. పోలీసులు అక్కడి నుంచి మొత్తం 12 బియ్యపు సంచులను స్వాధీనం చేసుకుని, శివంపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడకూడదని, ప్రజలు ఇలాంటి ఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.








