శంకరంపేట్ – డీజిల్ దొంగల గ్యాంగ్‌ను అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను శంకరంపేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల సందర్భంగా బలెనో కారు (TS08FF 3047)ను ఆపి తనిఖీ చేయగా 30 లీటర్ల సామర్థ్యం గల ఆరు ఖాళీ డబ్బాలు గుర్తించారు.

కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు — సబవత్ రాహుల్ (వనపర్తి), కురుమ గణేష్ (కామారెడ్డి), తోకల నాగరాజు (మహబూబ్‌నగర్) — విచారణలో డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించారు.
నిందితులు హైదరాబాదు బోరబండ ప్రాంతానికి చెందిన అన్వర్ అనే వ్యక్తితో కలిసి లారీల నుండి డీజిల్ దొంగిలించి అమ్ముతూ ఉన్నారని వెల్లడించారు. ఇటీవల జోగిపేట, శంకరంపేట్ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా దొంగతనాలు జరిపినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు అన్వర్ పరారీలో ఉన్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment